రీడింగ్ మారథాన్** 📘🎤 రానున్న *ఆగస్ట్ 15 వ తేదీ నుండి సెప్టెంబర్ 8 వ తేదీ వరకు*

 *🌷🌷ఫ్లాష్.... ఫ్లాష్....* 





  **రీడింగ్ మారథాన్** 📘🎤


రానున్న *ఆగస్ట్ 15 వ తేదీ నుండి సెప్టెంబర్ 8 వ తేదీ వరకు* 4 వారాల పాటు అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠ శాలల్లో నిర్వహించాలి.


 *కార్యక్రమ లక్ష్యము:* 


అందరు విద్యార్థులు రీడింగ్ మారథాన్ లో పాల్గొ నేలా చూడాలి.


విద్యార్థులచే 3 కోట్ల కథలు( ఒక్కొక్కరు 20 కథలు చొప్పున) రీడ్ అలాంగ్ యాప్ ఉపయోగించి  చదివించాలి.


ఈ క్యాంపెయిన్ రెండు స్థాయిల్లో నిర్వహించాలి.


1. పాఠ శాల వద్ద

2. విద్యార్థి ఇంటివద్ద


1).ప్రతి రోజూ  *పాఠ శాల వద్ద* ఒక గంట విద్యార్థులచే *"రీడ్ అలాంగ్ యాప్"* ఉపయోగించి కథలు చదివించాలి.


2).ప్రతి రోజూ  *ఇంటి వద్ద* ప్రతి విద్యార్థీ సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు రీడ్ అలాంగ్ యాప్ ద్వారా కథలు చదివేలా ప్రోత్సహించాలి.


ఉన్న డిజిటల్ రిసోర్సెస్ ను  పూర్తి స్థాయిలో వినియోగించుకొనుటకు, వివిధ వ్యూహాలను రూపొందించి అందరు విద్యార్థులు రీడ్ అలాంగ్ యాప్ ద్వారా కథలు చదివేలా ఉపాధ్యాయులు చూడాలి.


 *పర్యవేక్షణ విధానం:* 


అన్ని మండలాలలో,మండల విద్యాశాఖాధికారులు మండలాలకు కేటాయించిన పార్టనర్ కోడ్ లను ఉపయోగించి రీడ్ అలాంగ్ యాప్ ద్వారా  ఈ కార్యక్రమ పర్యవేక్షణ చేయాలి.


ప్రతి వారం Google team వారు లేటెస్ట్ రిపోర్ట్స్ మండలాలకు పంపుతారు.


 *పర్యవేక్షణ చేయాల్సిన అంశాలు:* 


మండలంలో ఉపయోగిస్తున్న  డివైస్ ల సంఖ్య 

మండలం లోని విద్యార్థులు చదివిన కథల సంఖ్య


 మండలం లోని విద్యార్థులు సరిగా చదివిన పదాల సంఖ్య


 మండలం లోని విద్యార్థులు రీడ్ అలాంగ్ యాప్ ఉపయోగించిన సమయం


 *ప్రోత్సాహకాలు ఇచ్చే విధానం:* 


 మండలాలకు మధ్య ఆరోగ్యకర పోటీ వాతావరణం కల్పించాలి.ఒక లీడర్ బోర్డ్ ఏర్పాటు చేసి చదివిన కథల సంఖ్యను బట్టి   మండలాలకు,జిల్లాలకు రాంకింగ్ ఇస్తారు.

టాప్ 5 మండలాలకు ప్రోత్సాహకాలు అందిస్తూ, వెనకబడ్డ మండలాలను అగ్రస్థానానికి ఎగబాకేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తారు.


రీడింగ్ మారథాన్ ముగింపు కార్యక్రమమం లో విజేతలకు బహుమతులు ఇవ్వాలి.


కావున  అందరు MEO లు,HM లు,CRP లు 4 వారాలపాటు జరిగే రీడింగ్ మారథాన్ గైడ్లైన్స్ ను అన్ని పాఠ శాల ల ప్రధానోపాధ్యాయులు కు తెలియజేసి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి.


మండల స్థాయిలో MEO లు పర్యవేక్షించాలి.


 *DEO AND APC ANANTHAPURAM and SATHYASAI*

Post a Comment

Previous Post Next Post

Captcha X6 Smart Watch Sport Clock with Sim TF Card Slot Bluetooth Suitable