ది.27-08-2022 తేదీ ఉదయం 10గంటలకు డైరెక్టర్ MDM&SS విజయవాడ వారు రాష్ట్రము నందుగల అన్ని జిల్లాల కొ – అర్డినెటర్లు మరియు ఆపరేటర్లతో TELE CONFERENCE నిర్వహించియున్నరు. అందు ఈ క్రింద ఉదహరించిన సూచనలను చేసిరి
1. పాఠశాల జరిగిన ప్రతిరోజు IMMS APP ద్వారా హాజరు మరియు టాయిలెట్ల ఫోటోలు విధిగా మద్యహనము 1.గం లోగా ప్రతి ప్రధానోపాద్యాయుడు అప్లోడ్ చేయవలెనని సూచించిరి.
2. ప్రతిరోజు ప్రభుత్వము వారిచే సూచించబడిన మేను ప్రకారము మాత్రమే మధ్యాహ్న భోజనము వండించి విద్యార్ధులకు అందించవలసినదిగా సూచిస్తూ అట్లు కాక మేను యందు మార్పు చేసినయెడల ప్రభుత్వ పధకమును అమలుపరుచుటలో తప్పిదము చేసినట్లు భావించి చెర్యలు తీసుకొనబడునని సూచించిరి.
3. ప్రధానోపద్యాయులందరు ప్రతిరోజు MDM ఫోటోలతోపాటు HM INSPECTION REPORT తప్పని సరిగా సమర్పించవలెనని సూచించిరి లేని యడల ఆ రోజు మధ్యాహ్న భోజనము నిర్వహింపబడలేదని భావించబడును అని తెలిపిరి.
4. ప్రతి పాఠశాలను ఆ గ్రామమునందుగల EDUCATIONAL WELFARE ASSOCIATION వారిచె పాఠశాలను మధ్యాహ్న భోజనము అములు సందర్భములో సందర్శించి విజీట్ రిపోర్ట్ ను IMMS APP ద్వారా సమర్పించులా తగిన సూచనలు MEO/DI వారు ప్రధానోపాధ్యాయులకు జారీచేయవలెను.
5. కొద్దిమంది ప్రధానోపాధ్యాయులు గతములో తీసిన MDM/TMF ఫోటోలను భద్రపరచుకొని వాటినే పలుమార్లు IMMS APP ద్వారా అప్లోడ్ చేయుచున్నట్లు గమనించి అట్లు చేసినయెడల రూల్స్ ని అనుసరించి చెర్యలు తీసుకొనబడునని సూచించిరి.
6. MDM/TMF లలో వచ్చిన టిక్కెట్లను ప్రతిరోజు పరిశీలించుకొని సాద్యమైనంతవరకు అదేరోజున లేదా మరుసటిరోజున ఉదయము 10గం. లోగా వానిని క్లియర్ చేయవలసినదిగా సూచించిరి.
7. CCH లు మరియు ఆయాల హాజరు IMMP APP ద్వారా తప్పనిసరిగా నమోదు చేయుట మరువరాదు.
8. ప్రతి ప్రధానోపాద్యాయుడు మండల స్థాయి, జిల్లా స్థాయి లేక రాష్ట్ర స్థాయి నుండి వచ్చిన ఫోన్ సమాచారమునకు వెంటనే స్పందించి సూచించిన విషయముపై శ్రద్ధ పెట్టి చేయవలెను. కొంతమంది విధ్యార్ధుల హాజరు మరియు టాయిలెట్ల ఫోటోలు పాఠశాల ముగిసిన 2 లేక 3గం. ల సమయము తదుపరి అప్లోడ్ చేయుట తీవ్రముగా పరిగణించబడును. ఈ రెండు పనులు పాఠశాల నందు మధ్యహనము 1.గం లోగా లేదా 3గం. లోగా అప్లోడ్ చేయవలెను.
పై విషయములన్నియు తు-చ తప్పకుండ ఆచరించవలెను అట్లు కానియడల తీసుకొనబడు చర్యలకు పాఠశాల ప్రధానోపాద్యాయులు వారే స్వయముగా బాధ్యులగుదురు. MEO / DI ఈ విషయమై తగిన చర్యలు చేపట్టవలసినదిగా కొరడమైనది.