ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్* ► ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ( ఈహెచ్ఎస్

 *🪷 



తాజా వార్త::*

*🌸 ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్*

► ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ( ఈహెచ్ఎస్ ) కార్డులపై *ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవల కోసం అనుమతి* ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

► ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద ఇప్పటివరకూ కవర్ కాని *565 వైద్య విధానాలను ఉద్యోగులకు వర్తింపజేయాలని* నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

► ఈ హెచ్ఎస్ ద్వారా వైద్యం చేసిన బిల్లులను ఆరోగ్యశ్రీ తరహాలోనే *21 రోజుల్లోనే ఆటోడెబిట్ స్కీమ్ ద్వారా చెల్లింపులకు* అంగీకారం తెలిపింది.

► *విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకూ ఇతర రాష్ట్రాల్లో* ఈహెచ్ఎస్ కార్డుపై వైద్య సేవలు పొందేందుకు వీలుగా అనుమతి ఇచ్చారు.

► మరోవైపు నెట్వర్క్ ఆస్పత్రుల్లో *ఈహెచ్ఎస్ కార్డుల సమన్వయానికి ఆరోగ్యమిత్రలకు ఆదేశాలు జారీ* చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

► మరోవైపు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన *మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాదిపాటు పొడిగించేందుకు వీలుగా త్వరలోనే ఉత్తర్వులు* జారీ అయ్యే అవకాశముందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

。・゚♡゚・。🪷。・゚♡゚・。🪷 

Post a Comment

Previous Post Next Post

Captcha X6 Smart Watch Sport Clock with Sim TF Card Slot Bluetooth Suitable