TIS – Important :
జిల్లాలోని అందరు మండల విద్యాశాఖాధికారులకు/పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు / ఉపాధ్యాయులకు/ మండల కంప్యూటర్ సిబ్బందికి తెలియచేయునది ఏమనగా..
• Teacher Information System (TIS) Website నందు అందరు ఉపాధ్యాయుల యొక్క వివరములు ఈ రోజు సాయంత్రమునకు Unfreeze చేయబడునని రాష్ట్ర కార్యాలయము నుండి తెలియచేసియున్నారు.
• ఈ విధంగా Unfreeze చేసిన ఉపాధ్యాయుల వివరములు కేవలం DDO పరిధిలో మాత్రమే Edit అవుతాయి.
• కావున DDO లు తమ పరిధిలో పనిచేస్తున్న అందరు ఉపాధ్యాయుల వివరములు ఒకసారి పరిశీలించి, తప్పులు ఉన్నట్లయితే వెంటనే సరిచేసి, అన్ని వివరములు సరిగా ఉన్నవని ధృవీకరించుకున్నతరువాత మాత్రమే Freeze చేయవలసినదిగా తెలియచేయడమైనది.
• TIS website ది.16.08.2022వ తేదీ సా.05.00 గంటలకు Close అవుతుందని రాష్ట్ర కార్యాలయము నుండి తెలియచేశారు.
• కావున DDO లు తమ పరిదిలో గల అందరు ఉపాధ్యాయుల యొక్క వివరములు సక్రమముగా ఉండేట్లుగా చూసుకొనవలసినదిగా తెలియచేయడమైనది.
టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం సంబంధించి విద్యాశాఖ కమిషనర్ వారి కార్యాలయ ఉత్తర్వుల ప్రకారము:
ఎస్జీటీ పోస్టుల యందు పనిచేయుచున్న లాంగ్వేజ్ పండిట్లను వారి యొక్క సొంత క్యాటగిరి అనగా లాంగ్వేజ్ పండిట్ గానే టి.ఐ.ఎస్ ఎడిట్ చేసి సబ్మిట్ చేయాలి.
అనగా అప్పర్ ప్రైమరీ స్కూల్ లలో పండిట్ పోస్ట్ శాంక్షన్ కాకపోయినా క్యాడర్ స్ట్రెంత్ లో పోస్ట్ ను చూపించి అక్కడ పండిట్ ను అప్డేట్ చేయవలసి ఉంటుంది. *లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులు పనిచేయుచున్న సెకండ్ గ్రేట్ టీచర్ పోస్టు ఖాళీగానే చూపించాలి.*
ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ నందు పనిచేయుచున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను వారి యొక్క సొంత క్యాడర్ అయిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పిఈటి) గానే చూపించాలి.
అనగా ఉన్నత పాఠశాలలో పిఈటి పోస్టు శాంక్షన్ కాకపోయినా క్యాడర్ స్ట్రెంత్ లో పి.ఈ.టి పోస్ట్ ను చూపించి సదరు కేడర్లో ఈ ఉపాధ్యాయుని చూపించాలి *స్కూల్ అసిస్టెంట్ పిఈ పోస్టును ఖాళీగా చూపించవలసి ఉంటుంది*