అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులుకు తెలియజేయునది.
1.అక్టోబర్ నెల నుండి MDM Special Packets తో Rice వస్తాయి. వాటిని మాత్రమే వినియోగించాలి.
2) ఒక "ట్రే" కోడిగుడ్లు(30 కోడిగుడ్లు) బరువు 1500 గ్రాములు మరియు "ట్రే"బరువు 85 గ్రాములు(మొత్తం గా 1585 గ్రాములు బరువు) ఉండేటట్లు ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా Check చేసుకోవలెను. (అనగా ఒక్కొక్క Egg బరువు 46 గ్రాములు నుండి 48 గ్రాములు మధ్య ఉండాలి). Eggs బరువు తెలుసుకోవడానికి Weighing machine (తక్కువ ఖరీదు లోనిది) ప్రతి పాఠశాలలో వుంటే మంచిది. Eggs వండే ముందు check చేసి, ముందు నీటిలో వేసి తేలిన గుడ్లును పాడైనట్లు గుర్తించాలి.
3) నెలలో మూడు సార్లు Eggs సరఫరా చేయబడతాయి. అవి 1వ తేది నుండి 10వ తేది వరకు - BLUE Colour ముద్ర తో,11వ తేది నుండి 20వ తేది వరకు - PINK Colour ముద్రతో , 21వ తేది నుండి 30వ తేది వరకు - GREEN Colour ముద్రతో ఉన్న Eggs అందించబడతాయి ( వీటిని పాఠశాలలో Chart పై Display చేయాలి). పై తేదిల ప్రకారం సప్లైదారుడు 4,5 రోజుల ముందుగానే మీకు Eggs సరఫరా చేస్తాడు.
4)చిక్కి 15 రోజులకు ఒకసారి సరఫరా చేయబడును. ఛిక్కి మీద seal మరియు manufacturing date తప్పనిసరిగా ఉండాలి. 1 Kg ఛిక్కి Packets లో 40 pieceలు ఉంటాయి. ఒక్కొక్క ఛిక్కి బరువు 25 గ్రాములు ఉండవలెను. విద్యార్ధులు MDM తీసుకోకపోయినా, అడిగిన వారికి boiled eggs మరియు chikkies తప్పనిసరిగా ఇవ్వవలెను.
5) CM గారి Dash Board లో కొన్ని పాఠశాలలు Menu Fallow కావడం లేదని వచ్చే complaints కు Hms బాధ్యత వహించాలి.
6) October నెల నుండి MDM కు సంబంధించి ప్రతి నెల state committe చే Social Audit ఉంటుంది.
7) ప్రతి పాఠశాలలో 14417 toll free Number అందరికి కనిపించే విధంగా Display చేయాలి.
8) ప్రతి రోజు Toilet Photos ను App నందు Upload చేయవలెను.Toilet కి సంబందించి ఏ Chemicals దేనికి వాడాలో ఆయలతో పాటు ఉపాధ్యాయులుకు కూడా తెలిసి ఉండాలి.
9)ఉపాధ్యాయులందరు దసరా సెలవులలో కూడా Office సిబ్బందికి మరియు CRPలకు Phone లో అందుబాటు లో ఉండవలెను.
10) దసరా సెలవులలో ఉపాధ్యాయులందరు Dairies, Lesson plans కంప్లీట్ చేసుకోవలెను.