🔳సెప్టెంబర్ 1న నిరసనలు :
:ఉపాధ్యాయులు, ఉద్యోగులుపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తును నిర్బంధ విధానాలపై గురువారం (ఒకటవ తేది) రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని పిడిఎఫ్, స్వతంత్ర ఎంఎల్‌సిలు పిలుపునిచ్చారు. యుటిఎఫ్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ వి బాలసుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కెఎస్ లక్ష్మణరావు, స్వతంత్ర ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ నిరసనలను రాష్ట్ర స్థాయిలో అడ్డుకుంటే జిల్లా స్థాయిలో నిర్వహిస్తామని, అక్కడ అడ్డుకంటే మండల స్థాయిలో చేస్తామని, దానిని కూడా అడ్డుకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికక్కడ చేస్తామని అనాురు. దీనికి సంబంధించి కార్యాచరణపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తామని తెలిపారు.
ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులపై బైండోవర్ కేసులా అని ప్రశిుంచారు. ప్రభుత్వ తీరు ఇదే మాదిరి కొనసాగితే తాము ప్రత్యక్ష పోరాటాల్లోకి దిగుతామని హెచ్చరించారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సిపిఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానానిు అమలు చేయాలని ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ఆందోళన చేస్తున్న వారిని నిర్బంధించడం, వేధింపులకు గురిచేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారన్నారు.
ఉపాధ్యాయులు హక్కుల కోసం పోరాడుతుంటే రాజకీయంగా తమపై దాడి చేస్తున్నారను ఆలోచనలో ఉను ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తూ దమనకాండను ప్రదర్శిస్తోందని చెప్పారు. దీనిలో భాగంగానే సిపిఎస్ సంఘాలు ఇచ్చిన ఉద్యమంపై ఉక్కుపాదం మోపిందని, యుటిఎఫ్, ఎస్టియు నాయకులను, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తోందని వివరించారు.
ఒకవైపు బడికి వచ్చి తీరాల్సిందేనని విద్యాశాఖ హుకుం జారీచేస్తుంటే మరోవైపు స్టేషన్లో ఉండి తీరాలనిపోలీసులు బెదిరిస్తునాురని తెలిపారు. సిపిఎస్ రద్దు చేసే వరకు పోరాటం
కొనసాగుతుందని, ఉద్యమాన్ని ఎంతదూరమైనా తీసుకెడతామని చెప్పారు. సిపిఎస్ అంశంపై గతంలో జరిగిన శాసనమండలి సమావేశాల్లో రోజంతా ఆందోళన నిర్వహించామని, సెప్టెంబర్‌లో జరిగే సమావేశాల్లోనూ ఇదే విధంగా చేస్తామని తెలిపారు.