సెలవులు మంజూరు అధికారం,కాలపరిమితుల పై ఉత్తర్వులు





G.O.Ms.No.58 విద్య తేది:22-04-2008  ద్వారా విద్యాశాఖలో వివిధ రకాల సెలవులు మంజూరు అధికారం,కాలపరిమితుల పై ఉత్తర్వులు ఇవ్వబడినవి, కాలక్రమేణ ఆ నియమాలను సవరిస్తూ G.O.Ms.No.70* విద్య తేది:06-07-2009 ద్వారా ఏఏ అధికారి ఎన్ని రోజులు, ఏరకమైన సెలవులు మంజూరు  చేయాలో తాజా మార్గదర్శకాలు జారీచేయబడినవి.

ప్రాథమిక/ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు:

ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేయు ఉపాధ్యాయులకు ఆకస్మిక సెలవులు లేదా ప్రత్యేక ఆకస్మిక సెలవులు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంజూరు చేస్తారు.15 ఆకస్మిక సెలవులు,7 ప్రత్యేక ఆకస్మిక సెలవులు, ఒకేసారి ఆకస్మిక సెలవులు/ప్రత్యేక ఆకస్మిక సెలవులు 10 రోజులకు  మించకుండా మంజూరు చేస్తారు.

ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు:
ఉన్నత పాఠశాలలో పని చేయుచున్న ఉపాధ్యాయులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక/ ఆర్జిత/ అర్ధవేతన/ కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 4 నెలల వరకు మంజూరు చేస్తారు.
ప్రసూతి సెలవు(Maternity Leave):

 మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల మంజూరు విషయంలో 180 రోజుల వరకు సెలవు మంజూరు చేసే అధికారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,మండల విద్యాధికారులకు  G.O.Ms.No.84 తేది:17-09-2012 ద్వారా కల్పించబడింది.

మండల విద్యాధికారులు:

తన పరిధిలోని ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు ప్రాథమిక/ప్రాథమికోన్నత  పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు/అర్ధవేతన సెలవులు/కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 4 నెలల వరకు మంజూరు చేస్తారు.

ఉప విద్యాధికారి:

తన పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలల, ప్రధానోపాధ్యాయులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక సెలవులతో పాటు ప్రాథ మిక/ప్రాథమికోన్నత /ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు ఆర్జిత/ అర్ధవేతన/కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 4 నెలల పైబడి ఆరు నెలల వరకు మంజూరుచేస్తారు.

జిల్లా విద్యాధికారి:

జిల్లాలోని ఉపవిద్యాధికారులకు, మండల విద్యాధికారులకు ఆకస్మిక/ప్రత్యేక ఆకస్మిక/ ఆర్జిత/అర్ధవేతన, కమ్యూటెడ్ సెలవులు మరియు వేతనంలేని సెలవులు 1సం॥ వరకు మంజూరు చేయవచ్చును. జిల్లాలోని అన్ని ప్రాథమిక/ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు 6నెలలనుండి 1 సం॥ వరకు అన్ని రకాల సెలవులు మంజూరు  చేస్తారు.

డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్:

మండల విద్యాధికారులకు/ఉన్నత/ ప్రాథమికోన్నత/ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు అన్ని రకాల సెలవులను 1 సం॥ నుండి 4 సం॥ వరకు సెలవు మంజూరు చేస్తారు.

 కొన్ని ముఖ్యాంశాలు:

  • సెలవు పై వెళ్ళిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా అదే పాఠశాలలో చేరవలసిన ఉంటుంది.
  • సెలవు నిర్ణీత గడువు ముగిసిన పిదప 15 రోజులలో వీధుల్లో చేరకపోతే జిల్లా విద్యాధాఖాధికారికి రిపోర్ట్ చేయాలి.
  • నిర్ణీత సమయానికి మా మించి అనుమతి లేకుండా సెలవు వినియోగించుకుంటే రీపోస్టింగ్ సందర్భంలో 4వ కేటగిరీకి బదిలీచేస్తారు.
  •  అధికంగా వాడుకున్న సెలవును  FR-18 ప్రకారం  అనధికార గైర్హాజరుగా భావించి డైస్ నాన్ గా ప్రకటిస్తారు.

Post a Comment

Previous Post Next Post

Captcha X6 Smart Watch Sport Clock with Sim TF Card Slot Bluetooth Suitable